Monday, January 20, 2025

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అమెరికాలో ఎన్ఆర్ఐలు నిరసన

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా అమెరికాలో ఎన్‌ఆర్‌ఐలు నిరసన చేపట్టారు. బే ఏరియాలో ప్రవాసాంధ్రులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని ప్రవాసాంధ్రులు డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేశారని ఎన్‌ఆర్‌ఐలు ప్రశ్నించారు. సైకో పోవాలి… సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. వియ్‌ఆర్‌విత్ సిబిఎన్ నినాదంతో ప్రవాసాంధ్రులు ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు క్షేమం కోరుతూ కూకట్‌పల్లిలో పూజలు చేశారు. వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన అభిమానులు సుదర్శన హోమం చేశారు. సుదర్శన హోమంలో నందమూరి సుహాసిని పాల్గొన్నారు.  స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News