Monday, December 23, 2024

న్యూజెర్సీలో ఎన్నారై మహిళ దారుణ హత్య … నిందితుడు భారతీయుడే

- Advertisement -
- Advertisement -

న్యూజెర్సీ: అమెరికా లోని న్యూజెర్సీలో పంజాబ్‌కు చెందిన ఇద్దరు మహిళలపై భారత సంతతికి చెందిన వ్యక్తి కాల్పులు జరపడం కలకలం రేపింది. న్యూజెర్సీ లోని కార్టెరెట్ లోని నివాస భవనం వెలుపల 19 ఏళ్ల గౌరవ్ గిల్ జరిపిన కాల్పుల్లో జస్వీర్ కౌర్ (29) మరణించారు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ కాల్పుల్లో మరో మహిళ , జస్వీర్ బంధువు గగన్‌దీప్ కౌర్ (20) తీవ్ర గాయాలతో న్యూయార్క్ యూనివర్శిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి క్లిష్టంగా ఉంది. నిందితుడు గిల్ వాషింగ్టన్‌కు చెందిన వాడని, బాధితులు జలంధర్ లోని నూర్‌మహల్‌కు చెందిన వారని తెలుస్తోంది. గౌరవ్ గిల్, గాయపడిన గగన్‌దీప్ కౌర్ ఇద్దరూ పరిచయస్తులే. పంజాబ్ లోని నకోదర్‌లో ఐఇఎల్‌టిఎస్ కోచింగ్ సెంటర్‌కు వీరు కలిసి వెళ్తుండేవారని తెలుస్తోంది.

మృతురాలు జస్వీర్ కౌర్ కార్ట్‌రెట్‌లో అమెజాన్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆమె భర్త ట్రక్ డ్రైవర్‌గా ఉన్నారు. కాల్పులు జరిగిన రోజు ఆయన న్యూజెర్సీలో లేరు. జస్వీర్, గగన్‌దీప్ తల్లిదండ్రులు చిన్నరైతులు. జస్వీర్ తండ్రి కేవల్ సింగ్ . ఈ కుటుంబం ఐదేళ్ల క్రితం అమెరికాకు తరలి వెళ్లారు. గగన్‌దీప్ స్టడీ వీసాపై అమెరికా వెళ్లారు. ఇటీవలనే ఆమె తన కష్టాలను జస్వీర్‌కు చెప్పుకున్నారు. కాల్పులు జరిగిన రోజున అంతకు క్రితమే గగన్‌దీప్‌ను తన ఇంటికి జస్వీర్ కౌర్ ఆహ్వానించింది. ఇంట్లో జస్వీర్ నిద్రలో ఉండగా, బయట నిందితుడుతో గగన్‌దీప్ వాగ్వాదానికి దిగారు. సహాయంగా జస్వీర్‌ను గగన్ దీప్ పిలవగా, ఆమె జోక్యం చేసుకుందని నిందితుడు గిల్ మృతురాలు జస్వీర్ ముఖంపై ఏడు తూటాలు పేల్చాడని జస్వీర్ తండ్రి కేవల్ సింగ్ తెలిపారు.

గిల్ తండ్రి చరణ్ మస్కట్‌లో ఉంటున్నారు. ఈ సంఘటన తెలిసిన తరువాత గిల్ తల్లి రెండు రోజులు ఆస్పత్రి పాలయ్యారు. నిందితుడు గౌరవ్ గిల్‌పై హత్య, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉన్నాడనే ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కాల్పుల వెనుక కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. గురువారం మిడిల్ సెక్స్ కౌంటీ కోర్టులో నిందితుడు గిల్‌ను హాజరు పరిచారు. మళ్లీ మంగళవారం కోర్టుకు గిల్ హాజరు కావలసి ఉంది. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ న్యూజెర్సీ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News