- Advertisement -
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఎ) అజిత్ దోవల్, ఫ్రాన్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకొర్నూతో రక్షణకు సంబంధించిన ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు సంబంధించి తయారు చేసే ఆయుధాల విషయంలో పరిశోధన, అభివృద్ధి అవసరాలను గురించి చర్చించారు. ‘మేక్ ఇన్ ఇండియా పాలసీ’ గురించి కూడా చర్చించారని అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య సైనిక సహకారంకు సంబంధించిన విషయాలను వారు సమీక్షించారు. నావికా రక్షణ సహకారం విషయంలో కూడా వారు చర్చించారు. జోధ్‌పూర్‌లో భారత్, ఫ్రాన్స్ దేశాలు కలిసి నిర్మించిన ‘గరుడా’ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ విషయంలో వారు తమ సంతృప్తిని వ్యక్తీకరించారు.
- Advertisement -