Saturday, April 5, 2025

సుల్లివాన్ తో దోవల్ విస్తృత స్థాయి చర్చలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సోమవారం అమెరికన్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివాన్‌తో విస్తృతస్థాయి చర్చలు జరిపారు. ప్రతిష్టాత్మకమైన క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఐసిఇటి)పై ఇండియా -యుఎస్ ఇన్షియేటివ్ అమలుపై ప్రధానంగా దృష్టి సారించారు.

ఇద్దరు ఉన్నత భద్రతా అధికారులు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై కూడా చర్చించినట్లు తెలిసింది. సుల్లివాన్, సీనియర్ అమెరికన్ అధికారులు, పరిశ్రమల ప్రముఖుల ప్రతినిధి బృందంతో కలిసి జూన్ 17 నుండి 18 వరకు న్యూ ఢిల్లీకి అధికారిక పర్యటనలో ఉన్నారు.

ఎన్‌ఎస్‌ఎ సుల్లివాన్ సోమవారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలిశారు. ఆయన ప్రధాని మోడీని కూడా కలుస్తారని భావిస్తున్నారు. జైశంకర్ ఈ సందర్భంగా ఓ ట్వీట్ (ఎక్స్) కూడా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News