న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్, ఐఫోన్లు ఉపయోగించేవారు వారానికి ఒక్కసారైనా తమ ఫోన్లను రిస్టార్ట్ చేసుకోవాలని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఎస్ఏ) తెలిపింది. ఈ ఫోన్ల ద్వారా అమెరికాలో రాజకీయ నాయకులు, ప్రజల మీద గూఢచర్యం చేస్తున్నట్లు ఎడ్వర్డ్ స్నోడెన్ అనే సంస్థ హెచ్చరించింది.
ఫోను భద్రంగా ముప్పులు కలిగించకుండా ఉండాలంటే వారంలో ఒక్కసారైనా స్మార్ట్ ఫోన్లను రీస్టార్ట్ చేయాలని జాతీయ భద్రత సంస్థ(ఎన్ఎస్ఏ) డాక్యుమెంట్ వెల్లడించినట్లు ఫోర్బ్స్ తెలిపింది. అలా చేయడం వల్ల మాల్వేర్ లు, ముప్పులు లేకుండా భద్రంగా ఉంటుందని వివరించింది. లక్షితులను లక్ష్యం చేసుకోడానికి జీరో-డే ఎక్స్ ప్లాయిట్స్ ను పెగాసస్ స్పైవేర్ కూడా ఉపయోగిస్తున్నది.
డాక్యుమెంట్ లో పేర్కొన్న ఫోన్ లు 2010 కంటే ముందటి ఫోన్లు. అయినప్పటికీ డాక్యుమెంట్ లో పేర్కొన్న సలహాలకు ఇప్పటికీ విలువ ఉంది.
ఫోన్లను రీస్టార్ట్ చేయడం వల్ల దాడుల నుంచి కాపాడుకోవచ్చు. ఆ డాక్యుమెంట్ ఇంకా అనేక సలహాలు కూడా ఇచ్చింది. వాటిలో బయోమెట్రిక్స్ ఉపయోగించడం, ఒరిజినల్ ఛార్జింగ్ కేబుల్స్ వాడటం వంటి సలహాలు కొన్ని ఉన్నాయి. ఫోన్ ను రీస్టార్ట్ చేయడం వల్ల మెమరీ లీక్స్ ను, బగ్ లున్న యాప్స్ మీ ఫోన్ కు నష్టం కలుగకుండా నివారిస్తుంది. ఒకవేళ మీరు వారంవారం రీస్టార్ట్ చేయడానికి బద్ధకస్తులయినట్లయితే, ఫోన్ తయారీదారులు బిల్టిన్ ఆప్షన్ కూడా ఫోన్ కు ఇచ్చారు. అది షెడ్యూల్ ప్రకారం రీస్టార్ట్ చేస్తుంది.