- Advertisement -
న్యూఢిల్లీ : యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ఇసిఒఎస్‌ఒసి) ప్రత్యేక సంప్రదింపుల హోదాను మంజూరు చేసిందని నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఇఎఫ్‌ఐ) ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి సెక్రటేరియట్‌తో ఇసిఒఎస్‌ఒసి సంప్రదింపుల హోదా ఎన్‌ఎస్‌ఇఎఫ్‌ఐకి చురుకుగా సంప్రదింపులు చేయడానికి అధికారం ఇస్తుంది. ఎన్‌ఎస్‌ఇఎఫ్‌ఐ చైర్మన్ కటారు రవి కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇది భారతీయ పునరుత్పాదక పరిశ్రమకు అందిన అరుదైన గౌరవం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారతదేశం విజయాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు అని అన్నారు.
- Advertisement -