Wednesday, January 22, 2025

ఎన్‌ఎస్‌యుఐ జాతీయ కార్యదర్శి సంపత్‌రాజ్ హత్య

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో గురువారం ఎన్‌ఎస్‌యుఐ జాతీయ కార్యదర్శి, న్యాయవాది సంపత్‌రాజ్ మృతదేహం లభించింది. ధర్మవరం పట్టణంలోని ఒక చెరువులో సంతప్‌రాజ్ మృతదేహం లబించింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తులెలియని వ్యక్తులు సంపత్‌రాజ్‌ను హత్యచేసి మృతదేహాన్ని చెరువులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ధర్మవరం మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన సంపత్‌రాజ్ గత 20 ఏళ్లుగా హిందూపురంలో నివసిస్తున్నారు. ఎన్‌ఎస్‌యుఐ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన కేరళలో పార్టీ ఇన్‌చార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కూడా సంపత్‌రాజ్ పాల్గొన్నారు. హిందూపురంలో ఒక న్యాయవాదితో ఆయనకు భూవివాదం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అన్ని కోణాలలో సంపత్‌రాజ్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News