Monday, December 23, 2024

మే 8న ఎన్‌టిఆర్ శత జయంతి సభ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు 100 వ జన్మదిన వేడుకల సందర్భంగా మే 8న శతజయంతి సభ ( మిని మహానాడు) నిర్వహిస్తున్నట్లు తెలుగు దేశం పార్టీ నాయకుడు పి. సాయిబాబా ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌టిఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలిట్ బ్యూరో సభ్యులు, గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జి ఎం. అరవింద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పి. సాయిబాబా అధ్యక్షతన హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్ ఖాజా మెన్షన్ హాలులో నిర్వహించే శతజయంతి ఉత్సవాలకు ఎన్‌టిఆర్ కుమారుడు యువరత్న నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నట్లు తెలిపారు.

టిటిడిపి రాష్ట్ర అద్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కని నర్సింహులు, మహిళా నాయకురాలు నందమూరి సుహాసిని తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఉదయం 10 గం.లకు పతాకావిష్కరణ, ఎన్‌టిఆర్‌కు నివాళులర్పించిన తర్వాత నందమూరి బాలకృష్ణ సభను ప్రారంభిస్తారని సమావేశం అనంతరం బాలకృష్ణకు సన్మానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌తో అనుబంధం ఉన్న ప్రముఖులకు, క్రీడాకారులకు సన్మానం, అవార్డుల ప్రదానం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమానికి ఎన్‌టిఆర్ అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, పార్టీ శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి సికిందరాబాద్ పార్లమెంటు అధ్యక్షులు పి. సాయిబాబా, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిషోర్, ప్రధాన కార్యదర్శి పి. బాల్‌రాజ్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస నాయుడు, నాయకులు జివిజి నాయుడు, ఆరిఫ్, శ్రీపతి సతీష్, సిహెచ్ విజయశ్రీ, ప్రశాంత్ యాదవ్, ఎస్. ప్రకాష్, సత్యనారాయణ, మల్లిఖార్జున్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News