Monday, January 20, 2025

నేడు ఎన్‌టిఆర్ 28వ వర్ధంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ సిఎం నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గురువారం ఆ పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముందుగా డా. బిఆర్ అంబేడ్కర్ సచివాలయం సమీపంలోని ఎన్‌టిఆర్ ఘాట్‌కు హిందూపురం టిడిపి ఎంఎల్‌ఏ నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ , రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసినితో పాటు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్ , తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు ఉదయం 7.30 గంటలకు చేరుకుని పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు.

అనంతరం రాష్ట్ర బి సి సెల్ అధ్యక్షులు శ్రీపతి సతీష్ ఆధ్వర్యంలో ఉదయం 9. గం లకు సికింద్రాబాద్ రసూల్ పుర చౌరస్తాలో ఉన్న ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి ఎన్‌టిఆర్ ఘాట్ వరకు అమర జ్యోతి ర్యాలీ నిర్వహించనున్నారు. అటు ఉదయం 10.గం లకు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టిఆర్ ట్రస్టు భవన్ హైదరాబాద్‌లో ఎన్.టి.ఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భవనేశ్వరిఆధ్వర్యంలో రక్తదాన శిబిరం , దివ్యాంగులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అటు యూసప్‌గూడ కృష్ణానగర్‌లో టిడిపి నేతలు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News