ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడపలో జరిగిన ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అక్కడ వేదిక మీద పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతూ తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల ప్రస్థానంలో మూడవ తరం నాయకుడిగా లోకేష్ ను అభివర్ణించారు.తెలుగుదేశం పార్టీ మూడోతరం నాయకుడైన లోకేష్ సమర్థతను కొనియాడుతూ ఆయనను ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రమోట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడును కోరారు. ఇది పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి పుర్రెలో పుట్టిన బుద్ధా లేకపోతే పథకం ప్రకారమే ఆయన చేత అలా చెప్పించారా అనే విషయమై ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతటా చర్చ జరుగుతున్నది.
మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చంద్రబాబు నాయుడుకు మింగుడు పడని విధంగా తయారైంది. ఇటీవల కాలంలో అక్కడ జరిగిన సంఘటనలు మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ మరి తను స్వయంగా అలా వ్యవహరిస్తున్నాడా లేక పైనుంచి ఎవరైనా అలా ఉండమని ఆయనను ఉసిగొలుపుతున్నారా తెలియదుగానీ కొద్దికాలం క్రితం హోం మంత్రి అనితను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు గాని, ఆ తర్వాత బియ్యం అక్రమంగా తరలిపోతోందంటూ ‘సీజ్ ది షిప్’ అని చేసిన నినాదం గాని, నిన్నగాక మొన్న తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయిన సంఘటన అనంతరం తిరుపతిలో పర్యటించి ఆయన చేసిన హడావుడి గాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రుచించే విషయాలేమీ కాదు.
ఎన్టీఆర్ వంశంలోని వారసులు అంటే బాలకృష్ణ, ఆయన కుమారుడు మోక్షజ్ఞ కావాలి. బాలకృష్ణ రాజకీయాల్లోనే క్రియాశీలంగా ఉన్నాడు. ఆయన హిందూపురం శాసనసభ్యుడు, పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు కూడా. లేదా దివంగత నాయకుడు ఎన్ టీ రామారావు చైతన్యరథ సారథి హరికృష్ణ అయినా కావాలి. ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్ లేదా కళ్యాణ్ రామ్ కావాలి.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మరణించి నిన్నటికి 29 సంవత్సరాలు. 1996 జనవరి 18న ఎన్టీ రామారావు అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లను తిరుగుబాటు నాయకుడు చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు కోర్టు స్తంభింపజేయడంతో ఆవేదనకు గురై ఆ రాత్రి ఎన్‌టి రామారావు గుండెపోటుతో మరణించారు. ఎన్టీ రామారావు మాకు అక్కరలేదు, ఆయనతో పనే లేదు అని అధికారం నుంచి దించేసిన తర్వాత బహిరంగంగానే ప్రకటనలు చేసిన చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ మరణానంతరం ఆయనకు తానే నిజమయిన వారసుడినని నిరూపించుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదు. నిత్యం ఆయన జపం చెయ్యకుండా గడిచిందే లేదు. ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయంటే శనివారంనాడు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడపలో జరిగిన ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అక్కడ వేదిక మీద పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతూ తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల ప్రస్థానంలో మూడవ తరం నాయకుడిగా లోకేష్‌ను అభివర్ణించారు.
తెలుగుదేశం పార్టీ మూడోతరం నాయకుడైన లోకేష్ సమర్థతను కొనియాడుతూ ఆయనను ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రమోట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడును కోరారు. ఇది పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి పుర్రెలో పుట్టిన బుద్ధా లేకపోతే పథకం ప్రకారమే ఆయన చేత అలా చెప్పించారా అనే విషయమై ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతటా చర్చ జరుగుతున్నది. ఉప ముఖ్యమంత్రి ఏం ఖర్మ.. చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యేలోగా లోకేష్‌ను ముఖ్యమంత్రిగానే ప్రకటిస్తారనే ప్రచారం కూడా జరిగింది గతంలో. కానీ కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన కారణంగా వయసురీత్యా తాను తప్పుకుని వారసుడిగా లోకేష్‌ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని చంద్రబాబు స్వతహాగా అనుకున్నా, వత్తిడికి లొంగి ఆ పని చెయ్యాలనుకున్నా సాధ్యం కాని పరిస్థితి. ఇంకో పక్క ఈ ప్రమాదాన్ని పసిగట్టినందువల్లనేమో పవన్ కళ్యాణ్ పదేపదే చంద్రబాబు నాయుడు సమర్థుడయిన నాయకుడనీ ఇంకో పదిహేనేళ్ళపాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారనీ ప్రకటిస్తూ ఉంటారు. ఇక లోకేష్‌ను ముఖ్యమంత్రిని చెయ్యడం కూటమి ప్రభుత్వంలో సాధ్యపడదు కాబట్టి ఉపముఖ్యమంత్రిగానైనా ప్రమోట్ చేయించుకోవాలనే ఆలోచన ఉన్నట్టు అర్థం అవుతున్నది. మంత్రివర్గంలో ఎవరిని చేర్చుకోవాలి, ఏ హోదా ఇవ్వాలి అన్నది పూర్తిగా ముఖ్యమంత్రి నిర్ణయం కాబట్టి దాని గురించి ఎవరూ ఏమీ ప్రశ్నించడానికి వీల్లేదు.
ఇక్కడ తెలుగుదేశం పార్టీ మూడు తరాల గురించి కొంచెం మాట్లాడుకోవాలి. లోకేష్ బాబు మూడవ తరం నాయకుడని అంటే ఎన్టీ రామారావు మొదటి తరం, చంద్రబాబు రెండవ తరం, లోకేష్ బాబు మూడో తరం అని అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ నాయుడు అయినా ఎన్.టి. రామారావు వారసులు ఎలా అవుతారు? రాజకీయ వారసత్వానికి కన్నబిడ్డలే కావలసిన అవసరం లేదనే వాదన చంద్రబాబు నాయుడు గానీ, లోకేష్ నాయుడు గాని, వాళ్ళని సమర్థిస్తున్న వారు గానీ చేయవచ్చు. కానీ ఎన్టీఆర్ వర్ధంతి వేళ ఆయన మరణించడానికి కొద్ది రోజుల ముందు చంద్రబాబు నాయుడు గురించి తన అభిప్రాయాన్ని వీడియోలో రికార్డు చేసిన విషయాలు గుర్తు చేసుకోవాలి. ఎన్టీఆర్ వంశంలోని వారసులు అంటే బాలకృష్ణ, ఆయన కుమారుడు మోక్షజ్ఞ కావాలి. బాలకృష్ణ రాజకీయాల్లోనే క్రియాశీలంగా ఉన్నాడు. ఆయన హిందూపురం శాసనసభ్యుడు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. లేదా దివంగత నాయకుడు ఎన్‌టీ రామారావు చైతన్యరథ సారథి హరికృష్ణ అయినా కావాలి. ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్ లేదా కళ్యాణ్ రామ్ కావాలి.ఎన్‌టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండీ ఆయనను విజయ పథంవైపు నడిపించిన చైతన్యరథ సారథి హరికృష్ణ ఆ తర్వాత కాలంలో రాజ్యసభ సభ్యుడై పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా వ్యవహరించారు. ఆయన ప్రస్తుతం లేడు కాబట్టి ఆయన కుమారులు ఎవరైనా మూడవ తరం రాజకీయాల్లో తెలుగుదేశానికి ప్రాతినిధ్యం వహించాలి కానీ లోకేష్ నాయుడు ఎలా అవుతారనేది ఇక్కడ ప్రశ్న.
ఎన్టీ రామారావు రాజకీయ వారసత్వం ఎవరిది అనే విషయం అలా ఉంచితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన.. ఈ మూడు పార్టీలతో కలిపిన కూటమి ప్రభుత్వంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు లోకేష్‌ను మరో ఉపముఖ్యమంత్రిగా నియమించినట్టయితే రెండవ అధికార కేంద్రం ఏర్పడి చంద్రబాబుకు మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతుందేమో. ఇప్పటికే పరిపాలన లోకేష్ చెప్పుచేతుల్లోకి వెళ్లిపోయిందని, చంద్రబాబు కేవలం నిమిత్తమాత్రంగానే ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ లో జనసేనకు పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి వంటి నాయకులు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి తర్వాతి తరం నాయకుడిగా లోకేష్‌ను ఎందుకు తయారు చేసుకోవడం లేదు అని చంద్రబాబు నాయుడి అనుకూల పత్రికలు ఇప్పటికే రాస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చంద్రబాబు నాయుడుకు మింగుడు పడని విధంగా తయారైంది. ఇటీవల కాలంలో అక్కడ జరిగిన సంఘటనలు మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ మరి తను స్వయంగా అలా వ్యవహరిస్తున్నాడా లేక పైనుంచి ఎవరైనా అలా ఉండమని ఆయనను ఉసిగొలుపుతున్నారా తెలియదుగానీ కొద్దికాలం క్రితం హోం మంత్రి అనితను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు గాని,
ఆ తర్వాత బియ్యం అక్రమంగా తరలిపోతోందంటూ ‘సీజ్ ది షిప్’ అని చేసిన నినాదం గాని, నిన్నగాక మొన్న తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయిన సంఘటన అనంతరం తిరుపతిలో పర్యటించి ఆయన చేసిన హడావుడి గాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రుచించే విషయాలేమీ కాదు. శాంతిభద్రతలను అదుపు చేసే విషయంలో హోం మంత్రి అనిత విఫలమవుతున్నారన్నట్టు మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడుని ఇరుకున పెట్టడమే కాకుండా తిరుపతి పర్యటనలో సంఘటనపట్ల తాను క్షమాపణలు చెప్పి ఊరుకోకుండా టీటీడీ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ అధికారి కూడా క్షమాపణలు చెప్పాలంటూ ఓ మాట వదిలేసి వెళ్లిపోయాడు. ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రిగా తను బాధ్యత తీసుకుని క్షమాపణలు కోరాడు అనుకుంటే పర్వాలేదు కానీ వాళ్లు క్షమాపణలు చెప్పాలి, వీళ్లు క్షమాపణలు చెప్పాలి అనడం కూటమి భాగస్వాముల మధ్య సఖ్యత లోపించిందేమో అనే సందేహాలకు తావిచ్చినట్టు అయింది.
నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడి నియామకం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమతానికి విరుద్ధంగా జరిగిందనే ప్రచారం ఉన్నది. అందుకే పవన్ కళ్యాణ్ తన తిరుపతి పర్యటనలో టీటీడీ అధ్యక్షుడిని టార్గెట్ చేసుకున్నారని కూడా చెప్పుకుంటున్నారు. టీటీడీ అధ్యక్షుడు బిఆర్ నాయుడు కూడా ముందు అన్యాపదేశంగానే అయినా ఎవరు పడితే వారు క్షమాపణలు చెప్పమంటే ఎందుకు చెప్పాలి అని మాట్లాడారు. ఆ తర్వాత మళ్లీ ఎవరి వత్తిడి వల్లనో టీటీడీ పాలక మండలి తరఫున క్షమాపణలు కోరారు. టీటీడీ అధ్యక్షుడి నియామకం మాత్రమేకాదు, రాజ్యసభకు సానా సతీష్ అభ్యర్ధిత్వాన్ని కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారని, అప్పుడు ఆయనను సంతుష్టుడిని చెయ్యడానికి సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడానికి నిర్ణయించినట్టు చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటన చెయ్యవలసి వచ్చిందని కూడా చెప్పుకుంటున్నారు.
దాదాపు నెల గడిచినా నాగబాబు మంత్రివర్గంలో చేరే విషయం ఇంకా కాగితాలకే పరిమితమై ఉంది. చంద్రబాబు నాయుడి వ్యవహారశైలి తెలిసిన వారు ఎవరికయినా ముందెప్పుడో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఫలానావాళ్ళను తీసుకుంటామని ఆయన ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాదు, రాజకీయంగా ఆయన ఎంత వత్తిడికి గురవుతున్నారో కూడా ఇటువంటి ప్రకటన స్పష్టం చేస్తున్నది. ప్రస్తుతానికి ప్రమాదం లేకపోయినా ఎప్పుడో అప్పుడు కూటమి బీటలు వారడం ఖాయమని మాత్రం అక్కడ పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి కేంద్రంలోని పెద్దలు.. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇస్తున్న ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రస్తుత ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీకి ముందున్నది ముసళ్ల పండుగ అన్న సంకేతాలను అయితే ఇస్తున్నదనే చెప్పాలి.
ఇప్పటికింకా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిగా ఉన్న చిరంజీవి సంక్రాంతి వేడుకలలో ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంబరాలలో ప్రధాన మంత్రి మోడీ వెంట ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. ఆ వెనువెంటనే జరిగిన కాంగ్రెస్ సొంత కార్యాలయ భవనం ఇందిరా భవన్ ప్రారంభోత్సవానికి మాత్రం డుమ్మా కొడతారు. ఇప్పటికే తమకు ఎంతో విధేయుడిగా ఉండి, సనాతన ధర్మ ప్రచారకుడిగా ముందుకుపోతున్న పవన్ కళ్యాణ్‌కు తోడు ఆయన సోదరుడు చిరంజీవి కూడా కలిస్తే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలోపేతానికి బాటలు పడతాయన్న ఆలోచన ఆ పార్టీ పెద్దల్లో కలిగితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? దక్షిణాది మీద దృష్టి పెట్టిన భారతీయ జనతా పార్టీకి మిగిలిన రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌లోనే సులభంగా అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు చిరంజీవి ద్వారా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్టు కనిపిస్తున్నది ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఇంతకాలం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన కేంద్రం మొన్నటి కేబినెట్ సమావేశంలో దాని బలోపేతానికి పదకొండు వేల కోట్లు కేటాయించడం, ప్రధానమంత్రి స్వయంగా ఆ విషయమై ట్వీట్ చేస్తూ ఇది ఆత్మనిర్భర్ భారత్‌లో భాగమని చెప్పడం వెనుక ఆంతర్యాన్ని అనుభవశాలి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోలేరని అనుకుందామా? ఈ పరిస్థితులన్నిటి దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఇప్పటికిప్పుడే కడప తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి కోరికను మన్నించి లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చెయ్యకపోవచ్చు. సొంతంగా ఎన్నికల్లో గెలిచిన చరిత్ర చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి ఎన్నడూ లేదు కాబట్టి ఆ రెండు పార్టీలను అంత సులభంగా దూరం చేసుకోకపోవచ్చు. అంతేకాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మరింత ప్రసన్నం చేసుకుని అధికారం పదిలంగా ఉండేట్టు చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యొచ్చు. అందుకేనేమో, గత వారం నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించినప్పుడు చంద్రబాబు, ఆయన కుమారుడు నమో నామస్మరణలో మునిగి తేలారు.