Monday, December 23, 2024

14 విదేశీ నగరాల్లో నీట్ యుజి ప్రవేశ పరీక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వైద్య కోర్సుల ప్రవేశ పరీక్ష నీట్ యుజిని మే 5న 14 విదేశీ నగరాలలోని పరీక్ష కేంద్రాలలో నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టిఎ) బుధవారం ప్రకటించింది. ఈ నెలారంభంలో నోటిఫై చేసిన పరీక్షకు సంబంధించిన సమాచార ప్రకటనలో పరీక్షార్థులకు భారత్ వెలుపల కేంద్రాల గురించిన ప్రస్తావన ఏదీ లేనందున అభ్యర్థుల నుంచి తమకు అభ్యర్థనలు వచ్చిన తరువాత ఎన్‌టిఎ ఈ నిర్ణయం తీసుకున్నది. ‘12 దేశాలలోని 14 విదేశీ కేంద్రాలలో కూడా పరీక్ష నిర్వహించాలని నిర్ణయించడమైంది’

అని ఎన్‌టిఎ సీనియర్ డైరెక్టర్ (పరీక్షలు) సాధన పరాశర్ తెలియజేశారు.పరీక్ష జరిగే 14 విదేశీ నగరాలు & దుబాయి, అబూ ధాబి, షార్జా (యుఎఇ), కువైట్ సిటీ (కువైట్), బ్యాంకాక్ (థాయిలాండ్), కొలంబో (శ్రీలంక), దోహా (ఖతార్), ఖాట్మండ్ (నేపాల్), కౌలాలంపూర్ (మలేషియా), లాగోస్ (నైజీరియా), మనామా (బహ్రెయిన్), ముస్కట్ (ఒమన్), రియాద్ (సౌదీ అరేబియా), సింగపూర్. భారత్‌లోని 554 కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News