ఎంఓయూపై పరస్పరం సంతకాలు
హైదరాబాద్ : ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌తో కలసి పని చేసేందుకు ఎన్‌టిపిసి ముందుకు వచ్చింది. ఈ మేరకు మెడికల్ ఎక్విప్‌మెంట్ సేకరణకు మద్దతుగా సిఎస్‌ఆర్ కింద హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌తో ఎన్‌టిపిసి హైదరాబాద్ గురువారం ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎన్‌టిపిసి లిమిటెడ్ తరఫున జిఎం హెచ్‌ఆర్ (SRHQ ) సబ్యసాచి పాధి , ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తరపున హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సూపరింటెండెంట్ , కన్వీనర్ బి.నాగేందర్‌లు ఎంఓయూపై సంతకం చేశారు. దేబాశిష్ చటోపాధ్యాయ, RED (సౌత్ & డబ్లూఆర్ -1), ఎస్‌ఎన్ పాణిగ్రాహి, జిఎం హెచ్‌ఆర్ , SRHQ , బద్రుద్దీన్ అన్సారీ,డిజిఎం హెచ్‌ఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఎంఓయూలో భాగంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలో ప్రత్యేకత కలిగిన ఉస్మానియా యూరాలజీ విభాగానికి ప్రత్యేక వైద్య పరికరాలు ఉపయోగించనున్నారు. పేద రోగులకు సేవ చేయడానికి సహకారం కోరుతూ ఆసుపత్రి ఎన్‌టిపిసిని సంప్రదించించిన క్రమంలో ఈ ఎంఓయూ కుదుర్చుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా దేబాశిష్ ఛటోపాధ్యాయ మాట్లాడుతూ ఎన్‌టీపీసీ మానవీయ ముఖంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రాథమిక విద్య, కమ్యూనిటీ హెల్త్, తాగునీరు, , శానిటేషన్, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, కమ్యూనిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొదలైన అంశాలలో సమగ్ర కమ్యూనిటీ డెవలప్‌మెంట్ చొరవను ఎన్‌టిపిసి ఇప్పటికే చూపిస్తోందన్నారు. అంతే కాకుండా హరితహారంలో భాగంగా ప్రాజెక్ట్‌ల పరిసరాల్లోనూ, జాతీయ స్థాయిలోనూ మొక్కలు నాటేకార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అలాగే ఆరోగ్యం, పోషకాహారంపై దృష్టి సారించడంలో కూడా నిమగ్నమై ఉందన్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌తో ఈ ఎంఓయూ లక్ష్యం .. జనాభాకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడంలో సహాయపడుతుందన్నారు.