Monday, December 23, 2024

పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారు: ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళి

- Advertisement -
- Advertisement -

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. గురువారం ఉదయం హైదరాబాద్ లోని డా బిఆర్ అంబేడ్కర్ సచివాలయం సమీపంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్దకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన బాలయ్య ఘనంగా నివాళులర్పించారు. పేదల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని బాలకృష్ణ అన్నారు.

ఈ రోజు తెల్లవారుజామున ఎన్టీఆర్ మనవళ్లు, నటుడు హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఘాట్ వద్ద అంజలి ఘటించారు. జూ.ఎన్టీఆర్ అక్కడి రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.. దీంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News