Friday, December 20, 2024

‘ఎన్టీఆర్ 30’ పట్టాలెక్కేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ‘ఎన్టీఆర్ 30’ మూవీ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ సంగీతం అందించనున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్, యువ సుధా ఆర్ట్ సంస్థలు నిర్మించనున్నాయి. ఈ మూవీని భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు కొరటాల తెరకెక్కించనున్నట్లు తెలిసింది. కాగా ఈ మూవీని 2024లో ఏప్రిల్ 4న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది.

నిజానికి ఈ మూవీ ఈపాటికే ప్రారంభం కావలసింది. అయితే ఇటీవల ఎన్టీఆర్ సోదరుడు తారకరత్న హఠాన్మరణంతో వారి కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. దీంతో ఈ మూవీ ప్రారంభాన్ని కొన్నాళ్ళు వాయిదా వేశారు. అయితే విషయం ఏమిటంటే ఈ మూవీని మార్చి 15న గ్రాండ్ లెవెల్లో లాంచ్ చేయనున్నట్లు తెలిసింది. అలాగే రెగ్యులర్ షూట్‌ని మార్చి మూడవ వారంలో ఆరంభించనున్నారట. కాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సంజయ్‌దత్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే వీటన్నింటిపై త్వరలోనే యూనిట్ నుండి పక్కాగా క్లారిటీ రానుందట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News