Sunday, December 22, 2024

కొరటాల శివ మా కుటుంబ సభ్యుడు: ఎన్టీఆర్

- Advertisement -
- Advertisement -

ఇండస్ట్రీ ప్రముఖులతో ‘దేవర’ సక్సెస్ పార్టీని మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ పార్టీకి చిత్ర బృందంతోపాటు రాజమౌళి, ప్రశాంత్ నీల్, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సక్సెస్ పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “కొరటాల శివతో ‘బృందావనం’ మూవీ నుంచి నా ప్రయాణం మొదలైంది. కొరటాల శివ మా కుటుంబ సభ్యుడిగా మారారు. ‘దేవర 2’ చిత్రీకరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని అన్నారు.

కాగా సెప్టెంబర్ 27న విడుదలైన దేవర మూవీ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా దేవర నిలిచింది. ప్రస్తుతం దసరా సెలవులు, పోటీగా మరో మూవీ కూడా లేకపోవడంతో మరిన్ని కలెక్షన్స్ రాబట్టనున్నందీ సినిమా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News