Monday, January 20, 2025

‘దేవర’ ప్రచార వీడియో వచ్చేసింది!

- Advertisement -
- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న దేవర మూవీ నుంచి వచ్చిన మొదటి ప్రచార వీడియో మామూలుగా లేదు. ఒకటింపావు నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. ఈ వీడియోని బట్టి చూస్తే ఇది సముద్రం, సముద్రదొంగల నేపథ్యంలో సాగే కథ అని అర్థమవుతోంది. కొందరు దొంగలు సముద్రంలో ఒక ఓడపైకి వెళ్లి సరకు దోచుకురావడాన్ని ఈ వీడియోలో చూపించారు.

అలాగే సముద్రం ఒడ్డున జరిగిన ఫైటింగ్ సీన్ లో ఎన్టీఆర్ తన శత్రువుల్ని చీల్చి చెండాడుతున్న సీన్ భయం గొలిపేదిగా ఉంది. చివర్లో ఎన్టీఆర్ ‘ఈ సముద్రం సేపల కంటే కత్తుల్నీ, నెత్తుర్నీ ఎక్కువ చూసుంటాది. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ పలికిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించేదిగా ఉంది. ఏప్రిల్ 5న విడుదలయ్యే దేవర కోసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News