Sunday, December 22, 2024

ప్రశాంత్ నీల్‌తో ‘అసుర’

- Advertisement -
- Advertisement -

అసుర అసుర అసుర అసుర.. రావణాసుర అంటూ… లవకుశ సినిమాలో విలనిజం పండించాడు ఎన్టీఆర్. మళ్లీ అలాంటి అవకాశమే ఈ స్టార్ హీరోకు రాబోతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్, మైత్రీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2023లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ చిత్రానికి ‘అసురుడు’ లేదా ‘అసుర’ అనే టైటిల్ ఫిక్స్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్‌లో నెగిటీవ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది.

అందుకే ఈ తరహా టైటిళ్లను పరిశీలిస్తున్నారట. ప్రశాంత్ నీల్‌కి మూడక్షరాల టైటిల్ అంటే సెంటిమెంట్. అందుకే ‘అసుర’కే ఓటేసే ఛాన్సుందని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ తరవాతే ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుంది. ఇటీవల ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య భేటీ జరిగింది. ఈ సమావేశంలో సినిమా కథ గురించి చర్చించారని టాక్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News