Saturday, April 19, 2025

తారక్‌పై రాజమౌళి ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ జపాన్‌లో విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా జపాన్ వెళ్లిన రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు. “ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని కొమురం భీముడో పాటలో తారక్ అద్భుతంగా నటించాడు. ఈ పాటలో అతను శరీరంలోని అణువణువుతోనూ హావభావాలు పలికించాడు”అని అన్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలాఉండగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి కలయికలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ఫాంటసీ వండర్ మూవీ యమ దొంగ. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్‌తో తెరకెక్కిన ‘యమ దొంగ’తో రాజమౌళి సత్తా చాటారు. ఇక ఇందులో మోహన్ బాబు ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. అయితే మే 20న తారక్ పుట్టినరోజు కాగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రింట్ 4కేలో రీ మాస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు ‘యమదొంగ’ సరికొత్తగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News