Monday, April 21, 2025

రేపటి నుంచి ‘ఎన్టీఆర్ నీల్’ చిత్రీకరణలో..

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కెజియఫ్, సలార్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ చిత్రాలను రూపొందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ యాక్షన్ ఎపిక్ మూవీ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రారంభమైంది. ఇటీవల ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. ఈ క్రేజీ మూవీ సెట్స్‌లోకి ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు అడుగు పెడతాడా అని అభిమానులు సహా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం వచ్చేసింది.

మంగళవారం నుంచి షూటింగ్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ పాల్గొంటున్నారు. దీని కోసం ఆయన హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెళుతున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయిక వెండితెరపై ఎలాంటి మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తుందోనని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సెట్స్‌లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నారనే వార్త ఆయన అభిమానులు, ప్రేక్షకులకు సరికొత్త ఉత్సాహాన్నిస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ యూనిక్ మాస్ విజన్‌తో ఎన్టీఆర్‌ను సరికొత్త మాస్ అవతార్‌లో చూపించబోతున్నారు. ఇది సినీ ఇండస్ట్రీలో సరికొత్త మైలురాయిని సృష్థించనుంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆరట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News