Sunday, January 19, 2025

త్వరలోనే సెట్స్‌పైకి ‘ఎన్‌టిఆర్ 30’

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో ఎన్‌టిఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ వంటి సక్సెస్‌పుల్ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న చిత్రం యంగ్ టైగర్ ఎన్‌టిఆర్ 30. ప్రస్తుతం కొరటాల శివ తన టీమ్‌తో కలిసి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌లతో కలిసి ఆడియెన్స్‌కి ఓ అద్భుతమైన అనుభూతిని అందిచడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మాసీవ్ పాన్ ఇండియా మూవీకి యువ సంగీత సంచలనం అనిరుధ్ సంగీతాన్ని అందించబోతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్‌టిఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కొరటాల శివకు సన్నిహితుడైన మిక్కినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

NTR and Koratala Siva’s film Shoot begins Soon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News