Wednesday, December 25, 2024

యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌లో ఎన్టీఆర్ మరో మూవీ

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీకి సిద్దమవుతున్నాడు. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఇప్పటికే ‘వార్-2’ సినిమాలో తారక్ నటిస్తున్నాడు. స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ‘వార్-2’ తరువాత మరో స్ట్రెయిట్ హిందీ మూవీలో నటించేందుకు తారక్ రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌తో మరో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. దీని కోసం సరైన కథను వెతుకుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమాను కూడా అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. మొత్తానికి ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టాడని.. వార్-2 తరువాత మరో సినిమాతో ఆయన బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడని వార్తలు సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. అయితే, వార్-2 తరువాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News