Monday, January 20, 2025

తనికెళ్ల భరణికి ఎన్టీఆర్ పురస్కారం బహూకరణ

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : శారద మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో వంశీ ఇంటర్నేషనల్ సౌజన్యంతో నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకుని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణికి ఎన్టీఆర్ పురస్కారం ప్రదానోత్సవం గురువారం త్యాగరాయగాన సభలో కన్నుల పండువగా జరిగింది. కార్యక్రమానికి సి.బి.ఐ.విశ్రాంత జాయింట్ డైరెక్టర్ జె.డి. లక్ష్మినారాయణ ముఖ్య అతిథిగా హాజరై తనికెళ్ల భరణికి పురస్కారం బహూకరించి, మాట్లాడారు. ఎన్టీఆర్ రాజకీయ రంగంలోను సినీ రంగంలో ధీరోదత్త నాయకుడు అన్నారు.

తనికెళ్ల భరణి..ఎన్టీఆర్ వలెనే బహుముఖీన ప్రతిభావంతులని, వారిని ఎంపిక చేసి అవార్డు అంద జేయడం సముచితంగా ఉందని అభినందించారు. సభాధ్యక్షత వహించిన ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ..ఎన్టీఆర్ పట్టుదల, పనిపట్ల అంకిత భావం వివరించారు. వంశీ గ్లోబర్ ఫిలిం అవార్డు ఫౌండర్ డాక్టర్ వంశీ రామరాజు నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సంఖ్యాశాస్త్రనిపుణులు దైవాజ్ఞశర్మ, ప్రముఖ గాయకుడు త్రినాథరావు, రచయిత బ్నిం, శారద మ్యూజిక్ అకాడమీ అధ్యక్షురాలు శారద తదితరులు పాల్గొన్నారు.

సభకు తొలుత గాయనీ శారద నిర్వహణలో గాయనీగాయకులు రేణుక, సుజాత, అచ్యుత, ఫణి, పవన్, మూర్తి, నాగేంద్ర, చంద్ర తదితరులు ఎన్టీఆర్ నటించిన వివిధ చిత్రాలల్లోని పలు గీతాలను మధురంగా ఆలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News