Monday, January 20, 2025

ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ

- Advertisement -
- Advertisement -

సోమవారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఒక్కసారిగా సోషల్ మీడియా వేడెక్కింది. ఈ స్టార్ హీరోకు అభిమానులంతా గ్రాండ్‌గా విషెస్ తెలియజేశారు. దీంతో తారక్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా తారక్ స్నేహితులు..సన్నిహితులు..కుటుంబ సభ్యులు అంతా తమదైన శైలిలో విషెస్ తెలియజేశారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రష్మికా మంధనా తదితరులు తారక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపియెస్ట్ బర్త్ డే టూ మైడియరెస్ట్ తారక్ అంటూ చరణ్.. జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు చేరాలంటూ మహేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తికర ప్రకటన చేసింది.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో మా బ్యానర్ లో రూపొందబోతున్న సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించబోతున్నామంటూ పేర్కొన్నారు. ఇదిలాఉండగా జనతా గ్యారేజ్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తొలి భాగం అక్టోబర్ 10న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News