Friday, November 22, 2024

ఎన్‌టిఆర్ యుగపురుషుడు.. కండక్టర్ అయ్యాక ఎన్‌టిఆర్‌ను అనుకరించి నటించా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఎన్‌టిఆర్ యుగపురుషుడని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ఆరేడేళ్ళ వయసులోనే పాతాళభైరవి సినిమా చూశానని, లవకుశ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఎన్‌టిఆర్‌ను చూశానని ఆయనన్నారు. తను కండక్టర్ అయ్యాక ఎన్‌టిఆర్‌ను అనుకరించి నటించానని చెప్పుకొచ్చారు. ఎన్‌టిఆర్ లా మేకప్ వేసుకొని ఫొటో దిగి నా స్నేహితుడికి చూపించాను, నేను కోతిలా ఉన్నానని నా స్నేహితుడు అన్నాడు అని ఆయన చెప్పుకొచ్చారు. విజయవాడలో ఎన్‌టిఆర్ శతజయంతి వేడుకల ప్రారంభ సభలో రజనీకాంత్ ప్రసంగించారు.

నా సన్నిహితులు సినీ రంగంలో రావాలని ప్రోత్సహించారు, ఎన్‌టిఆర్ ప్రభావం నాపై చాలా ఉంది అని ఆయనన్నారు. ఈ సభను చూస్తుంటే రాజకీయం మాట్లాడాలనిపిస్తోందని, రాజకీయం మాట్టాడొద్దని అనుభవం చబుతోందని అన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, చంద్ర బాబు ఘనత దేశ విదేశీ నాయకులకు కూడా తెలుసని అన్నారు. హైదరాబాద్‌ను హైటెక్ నగరంగా చంద్రబాబు మార్చారని అన్నారు. ఇటీవల చాలా కాలం తర్వాత హైదరాబాద్ సందర్శించాను , నేను హైదరాబాద్‌లో ఉన్నానా.. న్యూ యార్క్‌లోనా అనిపించింది అని రజనీకాంత్ అన్నారు. 2024లో చంద్రబాబు గెలిస్తే దేశంలో ఎపి నెంబర్ వన్ అవుతుందన్నారు. ఎన్‌టిఆర్ ఆత్మ చంద్రబాబును దీవిస్తుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News