Monday, January 20, 2025

ఘనంగా ఎన్‌టిఆర్ శత జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : ఎన్‌టిఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో జరిగిన స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా సత్తుపల్లి పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించి పట్టణంలోని స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ‘విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్‌టిఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడు ఎన్‌టిఆర్ అని అన్నారు. ఎన్‌టిఆర్ పేదల పెన్నిధి, రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారు. ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచిన నేత. ఎన్‌టిఆర్ సేవలు చిరస్మరణీయం. వారి ఆశయాలను సిఎం కెసిఆర్ పాటిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. వారి ఆశయాలను కొనసాగించడమే ఆయనకీ మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు.

యుగ పురుషుడు ఎన్‌టి రామారావు

యుగ పురుషుడు ఎన్‌టి రామారావు అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాజకీయాల్లో నూతన వరవడి సృష్టించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేసిన ఏకైక మహానేత ఎన్‌టిరామారావు అన్నారు. 100 సంవత్సరాలు గడిచిన పేద ప్రజల గుండెల్లో ఎప్పుడు ఎన్‌టిరామారావు చరసమయుడు ఎన్‌టి రామారావు రాజకీయ బిక్ష వల్లే నేను ఇద్దరి ఇంతటి గొప్ప పదవులు పొందినానన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పేద ప్రజల గుండెల్లో మహిళా గుండెల్లో ఎప్పుడు నిలిచేలా ఉంటాయి చిత్ర రంగంలో రాజకీయ రంగంలో నూతన పరవడి సృష్టించిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు చలసాని సాంబశివరావు, వెంకటేశ్వరరావు పైడి, దొడ్డాకుల రాజేశ్వరరావు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేష్, ఎంపీపీ దొడ్డాకుల హైమావతి శంకర్, జిల్లా గ్రంధాలయం అధ్యక్షులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ డివిజన్ అధ్యక్షులు వనమా వాసు, జడ్పిటిసి సభ్యులు కూసంపూడి రామారావు, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాసరావు, ముస్లిం మైనార్టీ జిల్లా నాయకులు షేక్ రఫీ, మట్టా ప్రసాద్, వీరపనేని బాబి, అద్దంకి అనిల్, చాంద్ బాషా, వల్లభనేని పవన్, పెద్దిరాజు పాల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News