Monday, December 23, 2024

తానా ద్వారా ఎన్‌టిఆర్ స్మారక నాణెం

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే అమ్ముడైన 25 వేలకు పైగా నాణేలు : టి.డి. జనార్ధన్ వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : తానా ద్వారా అమెరికాతో సహా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఎన్‌టిఆర్ స్మారక నాణెం సులభంగా అందుబాటులోకి వచ్చేలా ఒక ఒప్పందం జరిగిందని ఎన్‌టిఆర్ సెంట్‌నరీ కమిటీ అధ్యక్షులు టిడి జనార్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో తానా అధ్యక్షులు శృంగవరపు నిరంజన్, హైదరాబాద్ మింట్ సిజిఎం వి. నరసింహ నాయుడు, జాయింట్ డైరెక్టర్ గుండపునీడి శ్రీనివాస్తో జనార్దన్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం ఎన్‌టిఆర్ శతజయంతిని పురస్కరించుకొని విడుదల చేసిన ఎన్‌టిఆర్ స్మారక నాణెం ఇప్పటికే 25వేలకు పైగా అమ్ముడయ్యాయని తెలిపారు. అయితే అమెరికాతో సహా పలు దేశాలలోని ఎన్‌టిఆర్ అభిమానులు తమకు కూడా స్మారక నాణెం కావాలని కోరుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామన్నారు.

తానా అధ్యక్షులు శృంగవరపు నిరంజన్ మాట్లాడుతూ.. అమెరికాలోని వివిధ నగరాలలో ఉన్న తెలుగువారు ఎన్‌టిఆర్ స్మారక నాణెం కావాలని కోరుతున్నారని, వారందరికీ నాణెం సులభంగా లభించేలా చూసేందుకు మింట్ అధికారులతో చర్చిస్తున్నామన్నారు. అనంతరం మింట్ సిజిఎం నరసింహ నాయుడు మాట్లాడుతూ.. ఇప్పటికే ఎన్‌టిఆర్ స్మారక నాణెన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికి ఇండియా గౌట్ మింట్ . ఇన్ ( indiagovtmint.in ) వెబ్ సైట్ ఏర్పాటయ్యిందని చెప్పారు . దీని ద్వారా నాణేలు బుక్ చేసుకున్న వారికి ఇంటికి పంపిస్తామని చెప్పారు . మింట్ జాయింట్ డైరెక్టర్ గుండపునేడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్‌టిఆర్ స్మారక నాణెనికి వచ్చిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తానా వారి సహకారంతో విదేశాలలో వున్నా వారికి కూడా ఈ నాణెం ను పంపించడం జరుగుతుంది అన్నారు . రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు మాట్లాడుతూ ఎన్‌టిఆర్ స్మృతులు నిత్యనూతనమని ఆయన ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. దేశ సామాజిక రాజకీయ రంగాలపై ఆయన చూపిన ప్రభావం ఎనలేనిదని అందువల్లనే ఎన్‌టిఆర్ స్మారక నాణెలకు అంత డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అండమాన్, నికోబార్ అధ్యక్షులు మాధవనాయుడు , టి.డి.జనార్ధన్, ఎన్‌టిఆర్ సెంటినరీ కమిటీ సభ్యులు దొప్పలపూడి రామ్మోహన రావు , మధుసూదన రాజు , భగీరథ, విక్రమ్‌పూల, మండవ సతీష్‌లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News