Thursday, January 23, 2025

రికార్డు స్థాయిలో ఎన్‌టిఆర్ స్మారక నాణేలు అమ్మకాలు

- Advertisement -
- Advertisement -

మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వి.ఎన్.ఆర్. నాయుడు

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో తొలి స్మారక నాణెం ఎన్‌టి. రామారావుది తయారవుతున్న విషయం తెలిసిందే. కేవలం రెండున్నర నెలల్లోనే ఈ నాణెం 25,000 వరకు అమ్ముడు పోవడం దేశంలోనే సరికొత్త రికార్డు అని మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వి.ఎన్.ఆర్. నాయుడు తెలిపారు. శనివారం ఎన్‌టిఆర్ సెంటినరీ కమిటీ చైర్మన్ టిడి జనార్ధన్ ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ మింట్ అధికారులు విఎన్‌ఆర్. నాయుడు , శ్రీనివాస్ గండపనేడు , తానాజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ విఎన్ ఆర్ నాయుడు మాట్లాడుతూ  దేశంలో స్మారక నాణేల విడుదల 1964 నుంచి ప్రారంభమైందన్నారు. మొదట జవహర్ లాల్ నెహ్రూ , ఆ తరువాత మహాత్మా గాంధీ లాంటి మహనీయుల నాణేలను కేంద్రం విడుదల చేసిందని, అయితే ఇప్పటి వరకు స్మారక నాణేలలో 12,000 నాణేలు అమ్ముడు పోవడం రికార్డు అని , ఆ రికార్డు ను తాజాగా ఎన్‌టి ఆర్. స్మారక నాణెం బ్రేక్ చేసిందని తెలిపారు. ఆగష్టు 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని ఢిల్లీలో విడుదల చేశారని , అదే నెల 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చామని చెప్పారు . కేవలం రెండున్నర నెలల్లోనే 25,000 స్మారక నాణేలను విక్రయించడం జరిగిందని తెలిపారు.

కమిటీ చైర్మన్ టి డి .జనార్దన్ మాట్లాడుతూ అన్న ఎన్.టి.ఆర్ పేరుతో ఏ కార్యక్రమం మొదలు పెట్టిన నిర్విఘ్నంగా జరుగుతుందని చెప్పారు . ఎన్‌టిఆర్ శతాబ్ది సంవత్సరంలో మా కమిటీ , ఎన్.టి.ఆర్. శాసన సభ ప్రసంగాలు , ఎన్.టి .ఆర్.చారిత్రిక ప్రసంగాలు , శకపురుషుడు ప్రత్యేక సంచికను వెలువరించామన్నారు. హైదరాబాద్, విజయవాడ లో రెండు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి దివంగత ఎన్‌టిఆర్‌కు ఘనమైన నివాళి అర్పించామన్నారు.

ఇప్పుడు ఎన్.టి.ఆర్ .స్మారక నాణేలు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని తెలిసి ఎంతో సంతోషిస్తున్నామని ఆయన తెలిపారు . దేశంలో ఇప్పటి వరకు 200 నాణేలను విడుదల చెయ్యగా ,అందులో ఎన్‌టిఆర్ స్మారక నాణెం ప్రథమ శ్రేణిలో ఉండటం మాకు గర్వకారణంగా ఉందన్నారు. ఇది గిన్నెస్ రికార్డు సృష్టించాలని మేము కోరుకుంటున్నామని జనార్ధన్ చెప్పారు . ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కంఠంనేని రవి శంకర్ , భగీరథ , విక్రమ్ పూల , దొప్పలపూడి రామ్ మోహన్ , మండవ సతీష్ పాల్గొన్నారు.

mint

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News