Monday, January 20, 2025

జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ వాయిదా తప్పదా?

- Advertisement -
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీకి ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ మూవీని ఏప్రిల్ 5న విడుదల చేస్తామంటూ నిర్మాతలు ముందే ప్రకటించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దేవర రిలీజ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

అయితే ‘దేవర’ రిలీజ్ జూన్ నెలకు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇంకా 40 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉంది. అది పూర్తి కావాలసి ఉంది. పైగా ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల వేళ రిలీజ్ చేస్తే, అంతగా ఆదరణ ఉండదని నిర్మాతలు భావిస్తున్నారు. పైగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ లో గాయపడి, ముంబయిలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మోకాలికి సర్జరీ అయినట్లు తెలుస్తోంది. దీంతో దేవర రిలీజ్ వాయిదా తప్పేలా కనిపించట్లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News