Sunday, January 19, 2025

‘దేవర’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో గందరగోళం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో : జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర‘ సిని మా ప్రీ రిలీజ్ ఈవెంట్ గందరగోళానికి దారితీసింది. హైటెక్స్‌లో ఆదివారం సాయంత్రం దేవర సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అభిమానులు వేలాదిగా హాజరయ్యారు. తగిన భద్రత ఏర్పాటు చే యకపోవడంతో వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా దూసురావడంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అదుపు చేయడంలో విఫలమయ్యారు. నిర్వాహకులు, భద్రతా సిబ్బంది వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. కొందరిని లోపలికి అనుమతించకపోవడంతో అద్దాలు పగులగొట్టారు. ఎన్టీఆర్‌ను ఒక్కసారి చూడటానికి, అతనితో సెల్ఫీ దిగేందుకు వేలాదిగా వచ్చిన అభిమానులు ఆడిటోరియం లోపలకి భారీగా దూసుకొచ్చారు. భద్రతా సిబ్బంది వారికి నిరోధం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, క్రమశిక్షణను నిలబెట్టడంలో విఫలమయ్యారు. దీంతో వేడుకలో కాసేపు గందరగో ళం నెలకొంది.

కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతారని ముందుగానే అంచనా వేసినా, నిర్వాహకులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఈ పరిణామం తలెత్తింది. గేట్ల వద్ద నిలబెట్టిన కొద్దిపాటి సిబ్బందితో మాత్రమే అనుచిత పరిస్థితులు ఎదుర్కొనే ప్రయత్నం చేయడం వల్ల అభిమానుల కంట్రోల్ తప్పింది. తఏర్పాట్లకు మించి ప్రేక్షకులు రావడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఆడిటోరియం గేట్లు పగులగొట్టి లోపలికి చొచ్చుకుపోయారు. కొన్ని నిమిషాల పాటు కార్యక్రమం నిలిచిపోయింది. వేదికపై ఉన్న నటీనటులు, చిత్రబృందం కూడా ఆందోళనకు గురయ్యారు. అభిమానులు మరింత గందరగోళం సృష్టించకుండా భద్రతా సిబ్బంది వెంటనే అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని శాంతింపజేశారు. చివరకు ఫంక్షన్ కొన్ని నిమిషాల విరామం తర్వాత సజావుగా కొనసాగింది. ఎన్టీఆర్ వేదికపైకి వచ్చి, అభిమానులకు గౌరవంతో మాట్లాడుతూ, ఇలాంటి గందరగోళాలు సృష్టించకుండా అభిమానులు క్రమశిక్షణగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఘటనపై నిర్వాహకులు తమ వైఫల్యాన్ని అంగీకరించి, అభిమానులకు జరిగిన అసౌకర్యంపై క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మరింత కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

ప్రీ రిలీజ్ వాయిదా…
ఎన్‌టిఆర్ అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నోవాటెల్ హోటల్ అద్దాలు ధ్వంసం చేయడంతో నిర్వాహకులు కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తమ అభిమాన హీరో సినిమా ఈవెంట్‌ను వాయిదా వేయడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News