Monday, December 23, 2024

నవంబర్‌లో ఎన్టీఆర్- హృతిక్ వార్ 2 షూటింగ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ముంబై: టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలసి నటిస్తున్న వార్ 2 చిత్రం షూటింగ్ ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభం కానున్నది. 2019లో టైగర్ ష్రాఫ్ హీరోగా విడుదలైన వార్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ వార్ 2 చిత్రానికి అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: చంద్రముఖిలో లకలకలక శబ్దం ఎలా పుట్టిందో తెలుసా?

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలయికలో వెండి తెరపై సంచలనం సృష్టించనున్న వార్ 2 చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క శరవేగంగా జరుగుతున్నట్లు చిత్ర యూనిట్‌కు చెందిన వర్గాలు తెలిపాయి. భారత్‌లో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్ర నిర్మాణం జరగనున్నదని, పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత ఆదిత్య చోపరా, దర్శకుడు అయన్ సన్నాహాలు చేస్తున్నారని వారు చెప్పారు.

Also Read: ప్రేమదేశం ఆఫర్‌ను కాలదన్నుకున్న హీరోయిన్లు

బాలీవుడ్, టాలీవుడ్ స్టార్లు జతకట్టనున్న వార్ 2 చిత్రం ఇప్పటికే పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకోగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను ఆకట్టుకునే రీతిలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాలని ఆదిత్య చోప్రా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టే తారాగణాన్ని ఎంపిక చేస్తున్నారు. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ బ్యానర్‌పై వార్ 2 నిర్మాణం జరుగుతోంది. టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రానికి పఠాన్ చిత్ర దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News