Wednesday, January 22, 2025

రూ.100 నాణెంపై ఎన్టిఆర్ బొమ్మ.. ఆర్బిఐతో సంప్రదింపులు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ ముద్రణ గురించి తాము ఆర్బిఐతో మాట్లాడుతున్నామని ఆయన కుమార్తె, బిజెపి నేత దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్ టిఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్న నందమూరి, దగ్గుబాటి కుటుంబసభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఏడాది పాటు శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 12 కేంద్రాలను గుర్తించామన్నారు. పర్యవేక్షణకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News