గత ఏడాది దేవర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న జూ.ఎన్టిఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేస్తున్న సినిమాల్లో ‘వార్-2’ ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమా శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా గురించి.. ఎన్టిఆర్ గురించి హృతిక్ పలు ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు.
ఒక పాట మినహా అసి సినిమా మొత్తం పూర్తయిందని హృతిక్ తెలిపారు. తనకు పని చేసిన కో-యాక్టర్లలో గొప్ప నటుడు, మంచి టీమ్‌మేట్. మా సినిమా అద్భుతంగా వచ్చింది. కాగా, గతంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘వార్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇఫ్పుడు ‘వార్-2’పై కూడా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టిఆర్ రా ఏజెంట్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా.. ఆగస్టు 14వ తేదీన విడుదల కానుంది.