Thursday, January 23, 2025

ఆసియా ‘టాప్ 50’ జాబితాలో ఎన్టీఆర్..

- Advertisement -
- Advertisement -

బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆర్‌ఆర్‌ర్’తో అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రేజ్‌ను తెచ్చుకున్నారు స్టార్ హీరో ఎన్టీఆర్. తాజాగా ఆయన మరో ఘనతను సాధించారు. 2023లో ఆసియాలో ‘టాప్ 50’లో నిలిచిన నటుల జాబితాను ‘ఏషియన్ వీక్లీ’ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ జాబితాలో ఎన్టీఆర్ స్థానం దక్కించుకోవడం విశేషం. ‘ఈస్టర్న్ ఐ 2023’ పేరిట ఈ జాబితాను విడుదల చేయగా… ఇందులో తారక్ 25వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక హీరో ఎన్టీఆర్ కావడం విశేషం. ఇక ఈ లిస్ట్‌లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలవగా.. పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇటీవల అమెరికన్ మ్యాగజైన్ ‘వెరైటీ’ ప్రకటించిన 500 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఎన్టీఆర్, రాజమౌళి చోటు దక్కించుకోవడం విశేషం.

ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో నటిస్తున్నారు. కళ్యాణ్‌రామ్ నిర్మాణంలో పూర్తి సాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. విలన్‌గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఇటీవల గోవాలో ‘దేవర’ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ‘దేవర’ మొదటి భాగాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News