భారీ అంచనాలతో సిద్ధమవుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్‘ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్ నేతృత్వంలోని యువసుధ ఆర్ట్, కొసరాజు హరికృష్ణ ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్లపై భారీ స్థాయిలో పాన్ ఇండియా సబ్జెక్ట్‌గా నిర్మించబడుతుంది. ఈ చిత్రం త్వరలోనే ముహూర్త కార్యక్రమాలు జరుపుకొని జూన్ ద్వితీయ భాగంలో సెట్స్ పైకి వెళ్తుందని నిర్మాతలు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌పై సహజం గానే భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా భారీ స్థాయిలో ఈ చిత్రం ఉంటుందని ఫిల్మ్‌మేకర్స్ తెలిపారు.