Wednesday, January 22, 2025

2 డిఫరెంట్ లుక్స్‌తో ‘దేవర’.. కొరటాల గట్టిగానే కొట్టేట్టున్నాడుగా!

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రం దేవర. తారక్, కొరటాల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ రెండో సినిమాపై భారీ అంచనాలున్నాయి. మేకర్స్ మంగళవారం ఈ సినిమా నుంచి ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. తమ భయం తాలూకా ముఖాలు వీరే అంటూ ఎన్టీఆర్ తాలూకా రెండు డిఫరెంట్ లుక్స్‌ని కలిపి ఉన్న పోస్టర్‌ని రిలీజ్ చేశారు.

ఇందులో ఒక ముఖం నవ్వుతూ మరో ముఖం కోపంగా కనిపిస్తున్నాయి. ‘దేవర’ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. తొలి భాగాన్ని సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో నటిస్తుండటంతో అభిమానులు ‘దేవర’ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్, యువసుధ ఆర్ట్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News