Monday, January 13, 2025

జూ. ఎన్‌టిఆర్ సిఎం సిఎం అంటూ నినాదాలు… బాబు అసహనం

- Advertisement -
- Advertisement -

అమరావతి: మచిలీపట్నంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుకు జూనియర్ ఎన్‌టిఆర్ అభిమానుల సెగతగిలింది. జూనియర్ ఎన్‌టిఆర్ ఫొటోలు పట్టుకున్న యువకుడిపై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. విజయవాడ-మచిలీపట్నం వరకు జూనియర్ ఎన్‌టిఆర్, హరికృష్ణ ఫొటోలను నందమూరి అభిమానులు పట్టుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ ఎదుట ఎన్‌టిఆర్ ఫొటోలను ఆయన అభిమానులు ప్రదర్శించారు. జూనియర్ ఎన్‌టిఆర్ సిఎం అంటూ బాబు కాన్వాయ్ ఎదుట నినాదాలు చేశారు. ఎన్‌టిఆర్, హరికృష్ణ ఫొటోలు చూసి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. దీంతో టిడిపి కార్యకర్తలు ఎన్‌టిఆర్ అభిమానులపై దాడులు చేసినట్టు సమాచారం. జూనియర్ ఎన్‌టిఆర్ పాటలకు డ్యాన్సులు చేస్తున్న వారిని కొల్లు రవీంద్ర అనుచరులు చెదరగొట్టారు.

Read Also: కట్నం కోసం బ్లాక్‌మెయిల్: భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News