Wednesday, January 22, 2025

కొరటాల శివను ప్రశంసించిన జూనియర్ ఎన్టీఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దర్శకుడు కొరటాల శివ, నటుడు ఎన్టీఆర్ తో తీసిన చిత్రం ‘దేవర’ బాక్సాఫీసు వద్ద పెద్ద హిట్టయింది.  ఈ నేపథ్యంలో సినిమా తయారీదారులు సినిమా సక్సెస్ పార్టీని నిర్వహించారు. ఇందులో తారక్ మాట్లాడుతూ కొరటాలపై ప్రశంసల జల్లు కురిపించారు.

‘‘బృందావనం చిత్రంతో మా ప్రయాణం మొదలయింది.  కొరటాల ఇప్పుడు నా కుటుంబ సభ్యుడిగా మారారు. దేవర-2 సినిమా షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా…’’ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి చెబుతూ తనకు, కళ్యాణ్ రామ్ కు హరికృష్ణ కొసరాజు వెన్నెముక వంటి వారన్నారు. ఆయన వల్లే ఎన్టీఆర్ ఆర్ట్స ఉందన్నారు. ‘దేవర’ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ, మలయాళ నటుడు షైన్ టామ్ ఛాకో, బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ బాణీలు సమకూర్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News