Sunday, April 13, 2025

ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్..

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. రేపు ఎన్టీఆర్ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ రానుంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి నుంచి రేపు కొత్త అప్‌డేట్ రానుంది. రేపు మ.12.06 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు.  ఈ సినిమాకు రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 చేయనున్నారు. దీని తర్వాత ప్రడ్యూసర్ నాగవంశీతో మరో సినిమాను చేయనున్నట్లు ఎన్టీఆరే స్వయంగా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News