Thursday, January 16, 2025

సైఫ్ అలీఖాన్ కు కత్తిపోట్లు.. స్పందించిన ఎన్టీఆర్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యానని.. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. కాగా, గురువారం తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన ఓ అగంతుకుడు.. కత్తితో సైఫ్ అలీఖాన్ పై దాడి చేశాడు. సైఫ్ ను కత్తితో పొడిచి దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన దుండగుడి కోసం బాంద్రా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News