Tuesday, April 8, 2025

‘నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ సుకుమార్’.. ఎన్టీఆర్ ఫోస్ట్ వైరల్

- Advertisement -
- Advertisement -

ఇటీవల జపాన్ లో దేవర రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. తాజాగా డైరెక్టర్ సుకుమార్ తో దిగిన ఫోటోను ఎన్టీఆర్ అభిమానులతో పంచుకున్నారు. మొదట సుకుమార్, ఎన్టీఆర్ కలిసి, ఆప్యాయంగా హగ్ చేసుకున్న ఫోటోను సుకుమార్ భార్య తబిత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దానిని రీపోస్ట్ చేస్తూ.. ‘నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ సుకుమార్’ అని ఎన్టీఆర్ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం వీరిద్దరూ దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ‘నాన్నకు ప్రేమతో’ అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, ఇటీవల దేవర సినిమా సూపర్ హిట్ అందుకున్న తారక్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటి తర్వాత దేవర 2తోపాటు ప్రడ్యూసర్ నాగవంశీతో మరో సినిమా చేయనున్నట్లు ఇటీవల జరిగిన మ్యాడ్ స్కేయర్ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News