Thursday, January 23, 2025

తెలుగు ప్రేక్షకులు గర్వపడే సినిమా ‘బింబిసార’

- Advertisement -
- Advertisement -

NTR Speech at Bimbisara Pre Release Event

నందమూరి కళ్యాణ్‌రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘బింబిసార’. వశిష్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌పై హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 5న ఈ మూవీ గ్రాండ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. స్టార్ హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ “దర్శకుడు వశిష్ట ఎంత కసిగా కథను చెప్పాడో.. అంత కంటే గొప్పగా ఈ చిత్రాన్ని మలిచాడు. అందరి కంటే నేను అదృష్టవంతుడిని. ఎందుకంటే ఈ సినిమాను నేను ముందుగానే చూశాను. తొలి సినిమానే ఇంత గొప్పగా తెరకెక్కెంచాడంటే ఇకపై అతను ఎంత గొప్ప చిత్రాలను చేయగలడో అని చెప్పడానికి ఇదొక టీజర్ లాంటిది. తన జీవితానికి ట్రైలర్ వంటిది. బింబిసార చిత్రానికి కీరవాణి కొత్త పాటలు, కొత్త బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆయనే మా బింబిసారకు బ్యాక్ బోన్. ఈ సినిమా చూశాక నందమూరి కళ్యాణ్ రామ్ కాలర్ ఇంకా పైకి ఎత్తుతారు. కళ్యాణ్ అన్న కెరీర్ బింబిసారకు ముందు.. బింబిసారకు తరువాత అవుతుంది. ఇక థియేటర్లకు జనాలు రావడం లేదని అంటున్నారు.

కానీ నేను నమ్మను. మంచి సినిమా వస్తే ఆదరించే తెలుగు ప్రేక్షక దేవుళ్లు ఉన్నారు. బింబిసారను ఆదరిస్తారని, సీతారామం సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను”అని అన్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ “మంచి సోషియో ఫాంటసీ సినిమా తీసుకు రావాలన్న మా ప్రయత్నమే ఈ ‘బింబిసార’. ఆగస్ట్ 5న వస్తున్న ఈ సినిమా చూశాక ప్రేక్షకులు గర్వపడతారు. ఎందుకంటే ఇది మా తాత గారి వందో జయంతి సంవత్సరం. తెలుగు సినిమాకు మూల కారకుడైన ఆయనకు ఈ సినిమాను అంకితమిస్తున్నాను” అని చెప్పారు. డైరెక్టర్ వశిష్ట్ మాట్లాడుతూ “బింబిసార సినిమా విషయంలో మా నిర్మాత హరికి, హీరో కళ్యాణ్ రామ్‌కి థాంక్స్. వారే బ్యాక్ బోన్‌గా నిలబడ్డారు. వారి సాయాన్ని ఎప్పటికీ మరచిపోలేను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్యాథరిన్, సంయుక్త మీనన్, ఛోటా కె.నాయుడు, శ్రీమణి, వరికుప్పల యాదగిరి, చమ్మక్‌చంద్ర, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

NTR Speech at Bimbisara Pre Release Event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News