Sunday, December 22, 2024

పంతానికి పోయి ‘ఎన్‌టిఆర్‘ పరువు తీయవద్దు : విహెచ్‌పి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పంతానికి పోయి.. ఎన్టీఆర్ పరువు తీయొద్దని విశ్వహిందూ పరిషత్ నేతలు అన్నారు. ఖమ్మం లక్కారం చెరువులో ప్రతిష్టించనున్న ఎన్టీఆర్ విగ్రహం సహజసిద్ద రూపంలో లేకపోవడం బాధాకరం అని విహెచ్‌పి ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ మహానటుడు ఎన్టీఆర్ గౌరవాన్ని పెంచాలనుకుంటున్నారా? లేక తగించాలను కుంటున్నారా? అని నిర్వాహకులను ప్రశ్నించారు.

రాజకీయాల కోసం తెలుగు ప్రజల అభిమాన నటుడిని బలి చేయొద్దని సూచించారు. ఈ గందరగోళంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. దేవతల విగ్రహాలు, రాజకీయ నేతల విగ్రహాలకు సంబంధించిన అంశంపై పద్ధతులు, నిబంధనలు పాటించాలని ఆయన హితవు పలికారు. హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత నిర్వాహకుల ఆలోచన తీరు కూడా మార్చుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News