Monday, January 20, 2025

స్టైలిష్ లుక్‌లో జూనియర్ ఎన్టీఆర్…

- Advertisement -
- Advertisement -

బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, ఇతర సినిమా టీమ్ సభ్యులు ఆస్కార్ వేడుకలో పాల్గొనేందుకు ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే.

అమెరికాలో సందడి చేస్తున్న ఎన్టీఆర్ స్టైలిష్ లుక్స్‌తో అదరగొడుతున్నాడు. తాజాగా బ్లూ కలర్ సూట్‌లో ఉన్న కొన్ని స్టన్నింగ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వాటిలో అతను డాషింగ్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News