- Advertisement -
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో ఫారిన్ టూర్ లో బిజీగా బిజీగా ఉన్నాడు. అమెరికాలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ అభిమానులను కుష్ చేస్తున్నాడు. తాజాగా, న్యూయార్క్ సిటిలో తన భార్య లక్ష్మీప్రణతితో దిగిన ఫొటోను ఎన్టీఆర్ పోస్టు చేశారు. దీనిని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తూ… ఎన్టీఆర్ లుక్ అదిరిందని, క్యూట్ పెయిర్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గత రెండు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. ఈ మార్చిలో థియేటర్లలో వచ్చిన RRRతో అతను పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిన ముచ్చట తెలిసిందే.
- Advertisement -