Tuesday, September 17, 2024

‘ఆర్‌ఆర్‌ఆర్’ సెట్స్‌లో ఎన్టీఆర్, రాజమౌళి.. ఇదే ఫస్ట్ టైమ్

- Advertisement -
- Advertisement -

NTR with ID Card at RRR sets in Ukraine

“నేను ఐడి కార్డ్ ధరించి చాలా కాలం అవుతోంది. సెట్స్‌లో ఐడి కార్డ్ వేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్‌” అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఐడి కార్డుతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఐదు భాషల్లో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ అక్టోబర్ 13న విడుదలకానుంది.

కాగా, ఉక్రెయిన్‌లో జరుగుతున్న ఈ మూవీ సెట్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఐడీ కార్డు వేసుకుని కనిపించారు. ఎన్టీఆరే కాదు.. పక్కనున్న రాజమౌళి కూడా ఐడీ కార్డు వేసుకున్నారు. ఈ ఐడీ కార్డుపై ‘నందమూరి తారక రామారావు-హీరో’ అని ఉంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరిదశలో ఉంది.

NTR with ID Card at RRR sets in Ukraine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News