Monday, December 23, 2024

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హైదరాబాద్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హైదరాబాద్ సిద్ధం
ఈనెల 20వ తేదీన ప్రత్యేక సావనీయర్ విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: నారాచంద్రబాబు నాయుడు, బండారు దత్తాత్రేయ, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక, విశిష్ట అతిథులుగా ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ ఆధ్వర్యంలో మే 20వ తేదీన ‘శకపురుషుడు‘ సావనీర్, www.jaihontr.com వెబ్‌సైట్‌ల ఆవిష్కరణ జరుగనుంది.

మే 20వ తేదీన హైదరాబాద్, కూకట్‌పల్లి, కైతల్లాపూర్ మైదానంలో సాయంత్రం 5:00 గంటలకు ఎన్టీఆర్ పై రూపొందించిన ప్రత్యేక సావనీయర్ ‘శకపురుషుడు‘, వెబ్‌సైట్ ‘జై హోఎన్టీఆర్’ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం మొదలు కానుండగా ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమానులందరూ రావాలని ఎన్టీఆర్ కమిటీ ఆహ్వానం పలికింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News