Monday, January 20, 2025

బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ వద్ద ఎన్‌టీటీఎఫ్‌ 58వ స్నాతకోత్సవం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: నెట్టూర్‌ టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఫౌండేషన్‌ 58వ వార్షిక స్నాతకోత్సవం జరిగింది. ఎన్‌టీటీఎఫ్‌ వద్ద డిప్లమో/పోస్ట్‌ –డిప్లమో/పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లను పూర్తి చేసిన 2262 మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలోనే రెండు కాఫీ టేబుల్‌ పుస్తకాలను విడుదల చేశారు. దీనిలో గత ఆరు దశాబ్దాలలో ఎన్‌టీటీఎఫ్‌ విద్యార్థులు సాధించిన విజయగాథలను పొందుపరిచారు. ఈ స్నాతకోత్సవంలో పలువురు అతిథులు పాల్గొన్నారు. వీరిలో వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ ముఖ్య అతిథిగా హాజరుకాగా.. ఎంఎస్‌డీఈ సెక్రటరీ అతుల్‌ కుమార్‌ తివారీ, ఐఏఎస్‌ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఎన్‌టీటీఎఫ్‌ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ బృందం, పలువురు కార్పోరేట్‌ , పరిశ్రమ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్‌టీటీఎఫ్‌ ఇప్పటికే ఈ విద్యార్ధులందరికీ భారతదేశ వ్యాప్తంగా పలు సుప్రసిద్ధ కంపెనీలలో నియామకాలను చేసింది. కొంత మంది విద్యార్ధులు విదేశాలలోని కొన్ని కంపెనీలలో చేరారు. ఈ ప్రత్యేక దినోత్సవ వేళ విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవ వేడుకలో అతి ముఖ్యమైన అతిథులుగా వీరు హాజరయ్యారు.

నెట్టూర్‌ టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఫౌండేషన్‌ బలీయమైన మూలాలు కలిగి ఉండటంతో పాటుగా నిబద్ధత కలిగిన సంస్ధగా సాంకేతిక శిక్షణను 1959 నుంచి అందిస్తుంది. కేరళలోని నెట్టూరులో మూలాలు కలిగిన ఎన్‌టీటీఎఫ్‌ నేడు భారతదేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎన్‌టీటీఎఫ్‌ ను అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా సర్టిఫికేషన్‌ అందించడంతో పాటుగా ధృవీకరించారు. ఇప్పటివరకూ 60వేల మందికి పైగా యువతకు విజయవంతంగా శిక్షణ అందించడంతో పాటుగా అంతర్జాతీయంగా పలు సంస్థలలో నియామకాలు చేశారు. ఏ సమయంలో అయినా సరే దాదాపు 18వేలకు పైగా విద్యార్థులు పలు శిక్షణ కార్యక్రమాలను పొందుతుంటారు. ఎన్‌టీటీఎఫ్‌ ను పలు పరిశ్రమ రంగాలు గుర్తించాయి. ఎన్‌టీటీఎఫ్‌ ను ఎన్‌ఎస్‌డీసీ శిక్షణా భాగస్వామిగా కొనసాగిస్తుండగా, పలు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సైతం దీనిని శిక్షణ భాగస్వామిగా ఎంపిక చేసుకున్నాయి. ఎన్‌టీటీఎఫ్‌ డిప్లొమో ప్రోగ్రామ్‌లను ఎన్‌ఓసీఎన్‌ అక్రిడియేట్‌ చేయగా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నుంచి ఎన్‌సీసీ పలు అంతర్జాతీయ డిప్లొమోలను సైతం అందిస్తుంది.

ఎన్‌టీటీఎఫ్‌ ఇప్పుడు పలు టెక్నికల్‌ ప్రోగ్రామ్‌లను డిప్లొమో, పోస్ట్‌ డిప్లొమో, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్ధాయిలలో మెకానికల్‌, మెకాట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌, మాన్యుఫాక్చరింగ్‌ టెక్నాలజీ, ఐటీ మరియు కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్ట్‌లలో అందిస్తుంది.

ఈ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథి వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ మాట్లాడుతూ ‘‘దాదాపు 3000 మంది ఎన్‌టీటీఎఫ్‌ పూర్వ విద్యార్ధులు ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నారని నేను విన్నాను. ఇది అత్యున్నత నాణ్యత కలిగిన శిక్షణను భారతీయ యువతకు 1959 నుంచి దశాబ్దాలుగా ఎన్‌టీటీఎఫ్‌ అందించడాన్ని సూచిస్తుంది. ఎన్‌టీటీఎఫ్‌ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాలలో విస్తరించిందని తెలుసుకోవడం సంతోషంగా ఉంది. ఈ స్నాతకోత్సవ వేళ ఇక్కడకు రావడం ఓ గౌరవంగా భావిస్తున్నాను. ఎన్‌టీటీఎఫ్‌ లాంటి గౌరవనీయ , విశ్వసనీయ ఇనిస్టిట్యూట్‌లలో ఇంతమంది విద్యార్ధులు గ్రాడ్యుయేట్స్‌ కావడంతో పాటుగా పలు సంస్ధలలో ఉద్యోగాలు సైతం పొందడం పెద్ద పని. ఈ విద్యార్థుల విజయాలు ఎన్‌టీటీఎఫ్‌ విజయాన్ని ప్రదర్శిస్తాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఎన్‌టీటీఎఫ్‌ను ఈ విజయం పట్ల అభినందిస్తున్నాను’’ అని అన్నారు.

గౌరవ అతిథి, ఎంఎస్‌డీఈ సెక్రటరీ శ్రీ అతుల్‌ కుమార్‌ తివారీ, ఐఏఎస్‌ మాట్లాడుతూ ‘‘ఎన్‌టీటీఎఫ్‌ స్వీకరించిన నమూనా పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. పోటీతత్త్వంతో నైపుణ్యం ; సామాజిక విలువలతో నైపుణ్యం తో కూడిన శిక్షణ ఇక్కడ ఉంది. ఎన్‌టీటీఎఫ్‌ను ఇతర ఇనిస్టిట్యూట్‌లకు భిన్నంగా నిలిపే అంశం ఏమిటంటే, సామాజిక విలువలకు ప్రాముఖ్యత ఇవ్వడం.విద్యార్థులకు నేను ఇచ్చే సందేశమేమిటంటే, బాగా నవ్వండి. ఇతరులను కూడా సంతోషపెట్టండి. ఈ ప్రశంసలన్నీ కూడా ఎన్‌టీటీఎఫ్‌ యొక్క నాణ్యమైన శిక్షణను ప్రదర్శించడంతో పాటుగా ట్రైనీల సమగ్రమైన అభివృద్ధిని కూడా సూచిస్తుంది. ప్రతి ఒక్కరూ నేడు మరియు ఎప్పుడూ అద్భుత విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని అన్నారు

ఎన్‌టీటీఎఫ్‌ ఛైర్మన్‌ ఆర్‌ రామానుజమ్‌ మాట్లాడుతూ ‘‘అంతర్జాతీయంగా పోటీపడేందుకు సాంకేతిక విద్యను అందించడం ఎన్‌టీటీఎఫ్‌ యొక్క లక్ష్యం. దీనికి కట్టుబడి తమ కార్యకలాపాలను ఎన్‌టీటీఎఫ్‌ చేస్తుంది. మా విద్యార్ధులు తమ డొమైన్‌లలో పూర్తి నైపుణ్యం కలిగి ఉండటంతో పాటుగా ఎన్‌టీటీఎఫ్‌ అందించే సమగ్రమైన ప్రాక్టికల్‌ శిక్షణతో విజయవంతమైన టెక్నికల్‌ ప్రొఫెషనల్స్‌గా మారుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్ధలలో కీలక స్ధానాలలో బాధ్యతలు నెరవేరుస్తున్నారు. కొంతమంది వ్యాపారవేత్తలుగా మారారు. ఎన్‌టీటీఎఫ్‌ దేశానికి చెందిన సంస్థ. విద్యార్ధులకు సంబంధించి అత్యంత కీలకాంశం ఏమిటంటే, విలువలతో పనిచేయడం, పూర్తి అంకిత భావంతో ఉండటం, తమ ఎంప్లాయర్‌ నుంచి అత్యున్నత గౌరవం పొందడం. మా విద్యార్ధులు ప్రాంతీయ , జాతీయ, అంతర్జాతీయ నైపుణ్య పోటీలలో అత్యున్నత అవార్డులు పొందారు. వారు అదే రీతిలో మరిన్ని అవార్డులు సాధించగలరని నమ్ముతున్నాను. తద్వారా ఎన్‌టీటీఎఫ్‌ మరియు దేశానికి గర్వకారణంగా నిలువగలరు. ఎన్‌టీటీఎఫ్‌ ఫ్యాకల్టీలకు ఇది గౌరవం, ఎందుకంటే వారి విద్యార్ధులు తమ కెరీర్‌లో అత్యున్నత స్ధానాలను చేరుకున్నారు. గ్రాడ్యుయేటింగ్‌ విద్యార్థులందరికీ నా అభినందనలు’’ అని అన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News