Sunday, January 19, 2025

అణుదాడికి పాల్పడితే కిమ్ పాలన అంతమైనట్టే : దక్షిణ కొరియా హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

సియోల్ : ఉత్తర కొరియా దేశానికి దక్షిణ కొరియా తీవ్ర హెచ్చరికలు పంపింది. ఉత్తర కొరియా అణుదాడికి పాల్పడితే కిమ్ జోంగ్ ఉన్న పాలన అంతమైనట్టేనని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈమేరకు దక్షిణ కొరియా వార్తా సంస్థ కథనం పేర్కొంది. అణు క్షిపణులను ప్రయోగించే సామర్ధమున్న అమెరికా జలాంతర్గామిని ఇటీవల దక్షిణ కొరియా సమీపంలో నిలిపి ఉంచారు. 1980ల తరువాత ఒక ఎస్‌ఎస్‌బీఎన్ ఆ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి. ఉత్తర కొరియా నుంచి ఇటీవల కాలంలో కవ్వింపు చర్యలు పెరగడంతో దక్షిణ కొరియా రక్షణకు కట్టుబడి ఉన్నామంటూ అమెరికా ఈ జలాంతర్గామిని కొరియా ద్వీపకల్పానికి తీసుకువచ్చింది.

దీనిపై కిమ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ తీరు అణుదాడికి దారి తీయొచ్చని వ్యాఖ్యానించింది. అదే జరిగితే , కిమ్ పాలన అంతమవుతుందని, దక్షిణ కొరియా హెచ్చరికలు పంపింది. దక్షిణ కొరియా అమెరికా కూటమిపై ఉత్తర కొరియా అణుదాడి చేస్తే … మా కూటమి నుంచి తీవ్రస్థాయి ప్రతిస్పందన వస్తుంది. దాని ఫలితంగా ఉత్తర కొరియా ప్రభుత్వం అంతమవుతుంది. ” అని వార్తా సంస్థ కథనం పేర్కొంది. అమెరికా జలాంతర్గామి రాకతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను కొనసాగిస్తోంది. తాజాగా కొరియా ద్వీపకల్పానికి పశ్చిమాన ఉన్న సముద్రం వైపు శనివారం క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ ప్రయోగాలు శనివారం తెల్లవారు జామున జరిగినట్టు దక్షిణ కొరియా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News