Friday, January 24, 2025

ఆ కన్వెన్షన్‌తో తెల్లవారుజామున వరకు న్యూసెన్స్

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : విజయనగర్ కాలనీలోని ఎక్స్‌సర్వీస్‌మెన్ కాలనీ హిల్‌టాప్ కన్వెన్షన్ హాల్ నిర్వహణ స్థానికంగా శాంతిభద్రతల సమస్యగా పరిణమించింది. వాయి, ధ్వని కాలుష్యం మెతాదుమించి మోగుతుండటంతో జనం మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. నిబంధనల పాతర వేసి ఇష్ఠారీతిన సాగుతోంది. ప్రజల ఆరోగ్యాలను పణంగాపెట్టి ధనార్జనే లక్షంగా కన్వెన్షన్ హాల్ సాగడం గమనార్హం.. వివాహాల సీజన్ కావడం తరుచూ అర్ధరాత్రి వేళ వరకు పెళ్లి ఊరేగింపు భరాత్‌లు, మితిమీరిన డప్పువాయిద్యాల హోరు. ఆర్కేస్ట్రాలతో వారికి న్యూసెన్స్‌గా మారింది.

చాలాసేపు వరకు సంతోషకర వేళలో టపాసుల శబ్దం డెసిమల్ మెతాదుకంటే ఎక్కువగా వినిరావడం కాలనీవాసులు తీవ్ర స్థాయిలో చిరాకు పడుతున్నారు. నిబంధలలను ఉల్లంఘించి సదరు వ్యక్తి ఓ మంత్రి పేరు చెప్పుకుని ఇష్ఠారీతిన వ్యవహరిస్తుండటం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఫంక్షన్ హాల్ నిర్వాహకులతో రాత్రి వేళలో నిద్ర కరువైందని పలువురి ఆవేదన చెందుతున్నారు. ఈ మధ్యనే సదరు వ్యక్తి జనావాసాల మధ్యనే ఫంక్షన్ హాల్ తెరిచారు. శుభకార్యాలు, సమావేశాలకు వందల సంఖ్యలో అతిథులు వస్తున్నారు.

వీరు తమ వాహనాలను తమ ఇళ్ల ముందు, రోడ్డుకి అడ్డగోలుగా పార్కింగ్ చేయడం తరుచూ గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది. అర్థరాత్రి వేళ వరకు జోరుగా బ్యాండ్ చప్పుళ్లు మెతాదుకు మించి శబ్దం వ్యాపించడం చుట్టూ పక్కల వారు మానసిక ప్రశాంత కరువైనది. బీపీ, చక్కెర, హృద్రోగం సమస్యలతో బాధపడుతున్న వారి పరిస్థితి మరీ ప్రమాదకరంగా మారింది. అనుమతులు లేకుండానే కన్వెన్షన్ కొనసాగడం గమనార్హం.. ఈ విషయాన్ని పదేపదే మున్సిపల్ వర్గాలు, హౌసింగ్ బోర్డు, ఇతర విభాగాలకు ఫిర్యాదులు చేస్తున్నాం కానీ ఈ దిశగా నేటికి ఫంక్షన్ హాల్‌పై చర్యలు లేవని కాలనీవాసుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రివేళలో తరుచూ గందరగోళం, గొడవలే…
తరుచూ శుభకార్యాలు నిర్వహణ స్థానికులకు ఇబ్బందిగా మారింది. శుభకార్యాలు ఉన్న ఆ రాత్రి జాగరణ చేయాల్సిందే… అతిథులు తమ వాహనాలను తమ ఇళ్లముందే నిలపడం వారు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. దీంతో తరుచూ పార్కింగ్ విషయంలో వారి వాగ్వావాదాలు, తోపులాటలతోపాటు దాడులకు దిగే పరిస్థితి వరకు వచ్చింది. కన్వెన్షన్ హాల్ కిచెన్ గదిలో వంటకాలు, నిప్పుల వేడి సెగలకు పక్కనే ఉన్న ఇళ్ల గోడలు దెబ్బతింటున్నాయి.

వంట ఇనుప సామగ్రిలనుపైకి లేపి ఎత్తడం, అరుపులు, కేకలు వినిరావడం స్థానికులకు నిద్రలేమి సమస్య నెలకొన్నది. కొందరు దాదాగిరికి దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఆర్ధరాత్రి వేళలో డయాల్ 100కు చేయగా పోలీసులు రావడం పరిస్థితి సద్దుమనిగి.. తర్వాత మళ్లీ పరిస్థితి మాములే. రోడ్డుమీదనే ఉన్న కన్వెన్షన్ హాల్‌కు లోపల పార్కింగ్ వసతి లేదు. దీంతో అతిథులు రోడ్డు, ఇళ్లముందే నిలపాల్సి వస్తోంది. ప్రజలకు ఇబ్బందిగా మారిన సమస్యను అధికారులు తీవ్రంగా పరిగణించి ఈ దిశగా సదరు వ్యక్తిపై చర్యలకు ఉపక్రమించాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News