Thursday, January 23, 2025

25 నుంచి మళ్లీ నుమాయిష్

- Advertisement -
- Advertisement -

Numaish exhibition again from feb 25

మనతెలంగాణ/హైదరాబాద్ :హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (81వ నుమాయిష్) ఈ నెల 25వ తేదీ నుంచి పునః ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వాయిదాపడగా ప్రస్తుతం వైర స్ ఉధృతి తగ్గుముఖం పడడంతో మళ్లీ ప్రా రంభిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించా రు. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుం చి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్‌ను సందర్శించవచ్చని వారు పేర్కొన్నారు. వా రాంతల్లో మరో అరగంట పొడిగించి 11 గంటల వరకు ప్రదర్శనకొనసాగుతుందని వా రు తెలిపారు. ఇంతకు ముం దు జనవరి 1న నుమాయిష్ ప్రారంభం కాగాదేశవ్యాప్తం గా కరోనా విజృంభిస్తోన్న నేపథ్యం లో ఈ సంవత్సరం నుమాయిష్‌ను రద్దు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎగ్జిబిషన్ సొసైటీకి నోటీసులు ఇచ్చారు. కరోనా పరిస్థితుల్లో నుమాయిష్‌ను మూసేయాలని నగర సిపి సీవీ ఆనంద్ సొసైటీకి సూచించగా నిర్వాహకులు 2వ తేదీ నుంచి దానిని నిలిపివేశారు. ఆ తర్వాత తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడడంతో మళ్లీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News